తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఐ - పిన్నాయిపాలెంలో సరకుల పంపిణీ

ఎక్కడ ఉన్నా... కన్న ఊరుపై మమకారం తగ్గలేదు. కరోనా కష్టకాలంలో... సొంతూరిలో పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి దాతృత్వం చాటుకున్నారు ఓ సర్కిల్ ఇన్స్​పెక్టర్.

nacharam circle inspecter mahesh goud distribute groceries in pinnayipalem
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఐ

By

Published : May 10, 2020, 3:06 PM IST

సూర్యాపేట జిల్లా పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన మాదగోని మహేష్ గౌడ్ హైదరాబాద్ నాచారంలో సర్కిల్ ఇనిస్పెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ వలస కూలీల బాధలు గమనించి నిత్యావసరాలు అందించారు. హైదరాబాద్​లో వారు పడుతున్న బాధలు సొంతూరి వైపుకు నడిపించాయి. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

మై విలేజ్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల చేపట్టిన ఈ పోలీస్ అధికారి... రెండు లక్షల రూపాయలతో పది రకాల వస్తువులు కొని సొంతూరికి చేరుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా 300 కుటుంబాలకు పంపిణీ చేశారు. కన్నతల్లిని, జన్మనిచ్చిన నేలకు రుణపడి ఉంటానంటున్నారు సీఐ మహేష్ గౌడ్.

ఇవీ చూడండి:అమ్మా.. నీ మనసు వెన్న...

ABOUT THE AUTHOR

...view details