సూర్యాపేట జిల్లాలో కుటుంబ కలహాలతో భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో బయ్య రమణ అనే గృహిణి భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. రాత్రి ఇంటి ఆవరణలో ఆరు బయట నిద్రిస్తున్న రమణను భర్త వీరయ్య గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. గత కొన్ని నెలలుగా భార్య , భర్తల మధ్య కలహాలు జరుగుతున్నట్లు మృతురాలి సోదరి పోలీసులకు వివరించింది. వృత్తి రీత్యా గీతాకార్మికుడైన వీరయ్య భార్యపై కసి పెంచుకుని అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో కల్లు గీసే కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. 15 సంవత్సరాల కిందట వివాహాం జరిగిన వీరికి ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు. కేసారం గ్రామంలో రెండు నెలల వ్యవధిలో ఇది రెండో హత్య కావడం వల్ల గ్రామ ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. సూర్యాపేట పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించి విచారిస్తున్నారు.
భార్యను కత్తితో గొంతుకోసి హతమార్చిన భర్త - మహిళ గొంతుకోసి దారుణ హత్య
కుటుంబ కలహాలతో భార్యను ఓ భర్త కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేసారంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
మహిళ గొంతుకోసి దారుణ హత్య