తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నిరాహారదీక్ష - mrps fast protest at maddirala mro office

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. ప్రభుత్వ అవసరాలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ భూములను లాక్కోవడాన్ని నిరిసిస్తూ దీక్ష నిర్వహించారు.

mrps fast protest at maddirala mro office
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నిరాహారదీక్ష

By

Published : Aug 27, 2020, 11:10 AM IST

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో తహసీల్దార్​ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం.. గత కొద్దికాలంగా రైతు వేదికలు, ప్రకృతి వనం, డంపింగ్​ యార్డు, శ్మశాన వాటిక పేరుతో కొన్ని సంవత్సరాలుగా దళితులు సేద్యం చేస్తున్న భూములను నిర్మాణాల పేరుతో బలవంతంగా లాక్కుంటున్నారని ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి కందుకూరి సోమన్న వెల్లడించారు.

ప్రభుత్వ అవసరాలకు భూములున్న రైతుల దగ్గర కొనుగోలు చేయాలని.. అంతేకానీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ భూములను లాక్కోవడం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్.. ఇప్పుడు వారిదగ్గరే భూములు లాక్కోవడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు.

ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details