తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం ప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోంది: కోమటిరెడ్డి - komatireddy venkatreddy

శ్రీశైలం అగ్నిప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని.. దానికి బాధ్యతగా రాష్ట్ర విద్యుత్​ శాఖ మంత్రి రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. ఆ ప్రమాదంలో మరణించిన వడ్డానం మహేష్​ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సరైన ఆర్థిక సాయం చేస్తూ... వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

mp-venkat-reddy-consolate-the-family-of-vaddanam-mahesh-who-died-in-srisailam-fire-accident
శ్రీశైలం అగ్నిప్రమాదంలో ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తోంది: ఎంపీ కోమటిరెడ్డి

By

Published : Aug 26, 2020, 9:03 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో శ్రీశైలం అగ్ని ప్రమాదంలో మరణించిన వడ్డానం మహేష్ కుటుంబాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. విద్యుత్ కేంద్రం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని, దానికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే సంబంధిత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరణించిన ఉద్యోగులకు ప్రభుత్వం రూ.2 కోట్ల ఆర్దిక సహాయం చేస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. మృతుని కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం అందించారు.

అదేవిధంగా మద్దిరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కుటుంబానికి రూ.50 వేలు అందించారు. పోలుమల్ల గ్రామానికి చెందిన అక్కినపల్లి సునీతకు రూ.30వేల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చెవిటి వెంకన్న, గుడిపాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'ఎంతమంది ప్రశ్నించినా కొవిడ్ పరీక్షలను ఎందుకు పెంచట్లేదు'

ABOUT THE AUTHOR

...view details