తెలంగాణ

telangana

ETV Bharat / state

'కౌన్సిల్​ ఆమోదం లేకుండా నిధులెలా మంజూరు చేస్తారు?' - suryapet latest news

సూర్యాపేట పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి ఉత్తమ్​కుమార్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిల్ ఎజెండాలో 40 అంశాలకు గానూ 30 అంశాలు... ఆర్టికల్ 26 కింద నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడాన్ని ఆక్షేపించారు.

mp uttam fire on officers for not allowing media
mp uttam fire on officers for not allowing media

By

Published : Jan 23, 2021, 5:34 PM IST

'కౌన్సిల్​ ఆమోదం లేకుండా నిధులు ఎలా మంజూరు చేస్తారు?'

మున్సిపల్ చట్టంలోని ఆర్టికల్ 26 అధికారాన్ని ఉపయోగించుకుని కౌన్సిల్ ఆమోదం లేకుండానే నిధులు మంజూరు చేయడంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సూర్యాపేట పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి ఉత్తమ్​కుమార్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిల్ ఎజెండాలో 40 అంశాలకు గానూ 30 అంశాలు... ఆర్టికల్ 26 కింద పనులు చేపట్టడాన్ని ఆక్షేపించారు. సూర్యాపేట మున్సిపల్ సమావేశం ప్రతి నెల జరిగే విధంగా చర్యలు తీసువాలని కమిషర్​కు సూచించారు.

సమావేశ హాలులోకి మీడియా ప్రతినిధులను అనుమతించని అధికారుల తీరును ఉత్తమ్​ తప్పు పట్టారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షప్రసారం చేస్తున్నప్పుడు పురపాలక సమావేశానికి అభ్యంతరం ఏంటని అధికారులను ప్రశ్నించారు. సూర్యాపేట సమీపంలోని 420 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్ కోసం రూ. 11 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మంజూరు చేయించినట్లు ఉత్తమ్ వెల్లడించారు.

ఇదీ చూడండి: ఊర్లో ప్రియురాలు, దుబాయ్​లో ప్రియుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details