సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం ముసిఒడ్డుసింగారంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాంలో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు, ఎంపీపీ.. పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెక్‌డ్యాంను పరిశీలించిన ఉత్తమ్.. ఈ నిర్మాణం రైతుల కోసమా లేదా కాంట్రాక్టర్ల కోసమా అని ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు.
'చెక్‌డ్యాం నిర్మాణం రైతుల కోసమా.. కాంట్రాక్టర్ల కోసమా?' - mp utham kumar reddy about check dam
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో రెండేళ్ల నుంచి అవినీతి తాండవిస్తోందని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలకవీడు మండలం ముసిఒడ్డుసింగారంలో నిర్మిస్తున్న చెక్‌డ్యాంను పరిశీలించారు. నిర్మాణంలో జరిగిన అవకతవకలను చూసి అధికారుల పనితీరును ఎండగట్టారు.

ఉత్తమ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెరాస నేతకు లబ్ధి చేకూర్చేందుకు చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని మార్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ సర్పంచ్.. వార్డు సభ్యులు, గ్రామస్థులు తీర్మానం చేసినా.. పనులు ఎందుకు నిలిపివేయలేదని ప్రశ్నించారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు జరగాలని కోరారు.