సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం.. పాలనలో పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వ పథకాల పేరుతో మొక్కలు నాటాలని, భవనాలు నిర్మించాలని లాక్కుంటున్నారని ఆరోపించారు.
భూములు లాక్కుంటున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రభుత్వ పథకాల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
భూములు లాక్కుంటున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎస్సీలకు మూడెకరాల భూమి అందిస్తామని హామీతో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వారిని విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా గ్రామానికి వంద నుంచి మూడు వందల వరకు ఇందిరమ్మ గృహాలను అందిస్తే... తెరాస 7 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదన్నారు. తుంగతుర్తిలో పార్టీ, కార్యకర్తలకు అండగా ఉంటూ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎనలేని సేవలు చేశారని చెప్పారు.
ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి