సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన పల్లె నర్సిరెడ్డి తన ఇంటి ఆవరణలోని పెరట్లో మొరం గడ్డలను సాగు చేస్తున్నాడు. అందులోని కొన్ని మొరం గడ్డలు నాలుగు కిలోల బరువు ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
మొరం గడ్డలు.. ఒకొక్కటి నాలుగు కిలోల పైమాటే.. - నారాయణగూడెంలో నాలుగు కిలోల పైన మొరం గడ్డలు
సాధారణంగా మొరం గడ్డ బరువు 100 నుంచి 250 గ్రాములు వరకు ఉంటుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి ఓ రైతు తన పెరట్లో సాగుచేసిన మొరం గడ్డలు నాలుగు కిలోల బరువు ఉండి స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.

మొరం గడ్డలు.. ఒకొక్కటి నాలుగు కిలోల పైమాటే..
మొరం గడ్డలు.. ఒకొక్కటి నాలుగు కిలోల పైమాటే..
శాఖీయోత్పత్తి జన్యుపరమైన మార్పుల వల్ల ఇలా అధిక బరువుతో పెరుగుతాయని మునగాల మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. ప్రతి సంవత్సరం తన పెరట్లో మొరంగడ్డలను సాగు చేస్తున్నట్లు రైతు పల్లె నర్సిరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం మొరం గడ్డ నాలుగు కిలోల బరువు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఫోటోలను సామాజిక మాధ్యమంలో పంచుకోవడంతో నర్సిరెడ్డి పండిస్తున్న మొరంగడ్డలను చూడడానికి అధిక సంఖ్యలో స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదీ చూడండి: అఖిల బెయిల్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయండి: కోర్టు