వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సూర్యాపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 90 పోలింగ్ కేంద్రాలకు భారీ బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సుల ద్వారా పోలింగ్ సామగ్రిని తరలించారు. జిల్లాలో పోలింగ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రంలో ఉన్న 9 కౌంటర్లు, మరో 2 ప్రత్యేక కౌంటర్లలో జంబో, పెద్ద బాక్సులను, బ్యాలెట్ పేపర్లను తరలించే విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
సమర్థవంతంగా...