ఉద్యోగ నియామకాలతో పాటు ప్రైవేట్ పరిశ్రమల్లో లక్షకుపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా కాలంలోనూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో మొదటిస్థానంలో నిలిచామని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం మండలాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
సంక్షేమ పథకాల అమలులో భేష్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి
అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం మండలాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మండలస్థాయి సమీక్షలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మేరీ మదర్ పాఠశాలలో మద్దిరాల, నూతనకల్లు, తుంగతుర్తి మండలాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల నిర్మాణం, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ ఛైర్మన్ దీపిక యుగేందర్ రావు, జిల్లా రైతు సమితి సమన్వయకర్త రజాక్, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు చర్ల సత్యనారాయణ గౌడ్, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, మండలాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.