సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 3,500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు.
'నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకుంటా'
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి... ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని... లేనిపక్షంలో పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు.
'నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ బరినుంచి తప్పుకుంటా'
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని... లేనిపక్షంలో పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. ఈ విషయంపై చర్చకు మీరు సిద్ధమా అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో... 14 లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
ఇదీ చూడండి:దుబ్బాక, జీహెచ్ఎంసీ ఓటమితోనే ఉద్యోగాల ప్రకటన: ఉత్తమ్