దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ అభివృద్ధిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెరాస ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
'బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి' - బండి సంజయ్‌పై ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగ్రహం
హుజూర్నగర్ అభివృద్ధిని చూసి భాజపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెరాస ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. హుజూర్నగర్ అభివృద్ధిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి'
హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి భాజపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దుబ్బాకలో భాజపాకు డిపాజిట్ కూడా దక్కదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ ఎన్నికల్లో భాజపాకు 2,600 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. బండి సంజయ్ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి.. ప్రకృతి వనం, రైతువేదిక పనుల్లో జాప్యం.. కలెక్టర్ శ్రుతి ఓఝా ఆగ్రహం