తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నివారణకు.. ఎమ్మెల్యేల అవగాహన... సైదిరెడ్డి ఐదు సూత్రాలు

కరోనా నివారణ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సూర్యాపేట జిల్లాలోని ఈ ఇద్దరు ఎమ్మెల్యే పలు కార్యక్రమాలు చేపట్టారు. కరోనా కట్టిడికి ఐదు సూత్రాలు అంటూ హుజూర్​నగర్​ ఎమ్మెల్యే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా తన నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. లాక్​డౌన్​ అమలు కొనసాగుతున్న తీరును తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ పర్యవేక్షించారు.

mlas-awareness-on-corona-precautions-at-suryapeta
కరోనా నివారణకు.. ఎమ్మెల్యేల అవగాహన... సైదిరెడ్డి ఐదు సూత్రాలు

By

Published : Mar 27, 2020, 9:05 PM IST

సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్​, తుంగతుర్తి ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, గాదరి కిశోర్​ కుమార్​లు కరోనా నివారణపై ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను అవగాహన కల్పిస్తున్నారు.

ఎమ్మెల్యే ఐదు సూత్రాలు

హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కరోనా వైరస్​ను ఐదు సూత్రాలలో గెలవచ్చు అని ప్రజలకు సూచించారు. మొదటిది యోగ, బ్రీతింగ్ ఎక్ససైజ్​, ఇండోర్ గేమ్స్ ఆడటం.

  • రెండోది ఒకే స్థలంలో 30 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోకుండా ఉండడం.
  • మూడోది మనం ప్రతి నిమిషం మన కుటుంబంతో కలిసి మెలిసి హాయిగా ఆహ్లాదంగా ఉండడం.
  • నాల్గోది కరోనాకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి విషయాలను నమ్మకుండా ఉండడం.
  • ఐదో ఆల్కహాలు తీసుకోకపోవడం, ప్రతి ఇల్లు పచ్చదనంతో కళకళలాడేలా చూసుకోవడం.

ఇలా ఈ ఐదు సూత్రాలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుంటే కరోనా మీ దగ్గరికి రాదని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు.

కరోనా నివారణకు.. ఎమ్మెల్యేల అవగాహన... సైదిరెడ్డి ఐదు సూత్రాలు

పర్యటన.. పర్యవేక్షణ

తన నియోజకవర్గంలో లాక్​డౌన్ అమలు ఎలా కొనసాగుతున్న తీరును అధికారులను ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ అడిగి తెలుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని వారిని ఆదేశించారు. ప్రజల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నిస్వార్ధంగా సేవ చేస్తున్న పోలీసులు, డాక్టర్లు, రెవెన్యూ, శానిటేషన్ డిపార్ట్​మెంట్​ వాళ్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇటలీలోని ప్రజలు తమ ప్రభుత్వాల మాట వినకపోవడం వల్ల దాని పర్యవసానాన్ని అనుభవిస్తున్నారని.. మన దేశంలోని ప్రజలకు ఆ పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు. కావున ప్రజలందురూ ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి స్వీయ నిర్బందంలో ఉండాలని.. సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందలేదు: ఈటల

ABOUT THE AUTHOR

...view details