'కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లు మాకొద్దు' - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
సమాజంలోని అన్ని వర్గాలను ప్రభావితం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్ట సవరణ బిల్లు మాకొద్దని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకోవాలని హుజూర్నగర్లో విద్యుత్ ఉద్యోగులకు సూచించారు.

'కేంద్ర విద్యుత్ చట్ట సవరణ బిల్లు మాకొద్దు'
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో విద్యుత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ విషయంలో తీసుకోబోతున్న నిర్ణయాలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకమని తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటలు కరెంటు ఉచితంగా అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. కరోనా సమయంలో విద్యుత్ ఉద్యోగులు పనితీరును ఈ సందర్భంగా ఆయన అభినందించారు.