తెలంగాణ

telangana

ETV Bharat / state

'హుజూర్​నగర్​ను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతాం' - Saidhi reddy Foundation for CC road works in Huzur Nagar

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తీసుకొస్తున్న నూతన పంట మార్పిడి విధానానికి రైతులందరూ బాసటగా నిలవాలని కోరారు.

MLA Shanmpudi Saidhi reddy Foundation for CC road works in Huzur Nagar
'హుజూర్​నగర్​ను అద్భుత పట్టణంగా తీర్చిదిద్దుతాం'

By

Published : May 25, 2020, 7:53 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మున్సిపాలిటీలో 17, 23 వార్డులో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శంకుస్థాపన చేశారు. పురపాలక సంఘాన్ని అన్ని హంగులతో అద్భుత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొస్తున్న నూతన పంట మార్పిడి విధానానికి రైతులందరూ బాసటగా నిలవాలని కోరారు.

నిజంగా ప్రతిపక్షాలకు రైతులపై ప్రేమే ఉంటే గతంలో వారు పాలించిన సమయంలో రైతులకు ఎందుకు 24 గంటల ఉచిత కరెంట్​ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details