సూర్యాపేట జిల్లా మెళ్లచెరువులో మహా సిమెంట్ ఫ్యాక్టరీలో నూతన మైనింగ్ ఏర్పాటు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు.
ఐటీ హబ్‌గా హుజూర్ నగర్ : ఎమ్మెల్యే సైదిరెడ్డి - Latest news in Telangana
హుజూర్నగర్ ఐటీ హబ్‌గా నిలవబోతుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు. మెళ్లచెరువులో మహా సిమెంట్ ఫ్యాక్టరీలో నూతన మైనింగ్ ఏర్పాటు కొరకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఇండస్ట్రీ యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
ఐటీ హబ్‌గా హుజూర్ నగర్ : ఎమ్మెల్యే సైదిరెడ్డి
సిమెంట్ ఇండస్ట్రీ వాళ్లు, స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు. ఐటీహబ్‌గా హుజూర్నగర్ నిలవబోతుందని వెల్లడించారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కార్యాచరణ ప్రారంభమైంది. నిరుపేద కుటుంబంలో ఎవరికైనా చదువు పూర్తై.. ఉద్యోగ వేటలో ఉంటే ఇండస్ట్రీ యాజమాన్యాలు వారికీ అవకాశమిచ్చి.. ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: ఎస్సారెస్పీ నీటితో హన్మకొండలోని కాలనీలు జలమయం!