తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా రోగుల పట్లు మానవత్వం ప్రదర్శించాలి: ఎమ్మెల్యే సైదిరెడ్డి - హుజూర్​నగర్​ తాజా వార్తలు

పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమన్వయంతో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచెర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు.

mla saidireddy inaugurate trs party office at nereducharla suryapet  district
కరోనా రోగుల పట్లు మానవత్వం ప్రదర్శించాలి: ఎమ్మెల్యే సైదిరెడ్డి

By

Published : Aug 5, 2020, 6:07 PM IST

కరోనా వైరస్ సోకిన వారిని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని.. వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా భరోసా కల్పించాలని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల పట్టణంలో నూతనంగా నిర్మించిన తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు. కొవిడ్​ మహమ్మారి సోకినవారికి మానసిక ధైర్యాన్ని కలిగించండి. వైరస్​​తో చనిపోయినవారి దహనసంస్కారాలు గ్రామంలో జరిగేలా చూడాలన్నారు

పట్టణాల అబివృద్ది తెరాస ప్రభుత్వ ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సమన్వయంతో ఉంటూ పార్టీ బలోపేతానికి తోడ్పడాలని అన్నారు. త్వరలో హుజుర్​నగర్​లో ఇండస్ట్రీయల్​ పార్క్​ఏర్పాటు కాబోతున్నదని.. నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

ఇదీ చదవండి:పునాది రాయితో పులకించిన అయోధ్య

ABOUT THE AUTHOR

...view details