తెలంగాణ

telangana

ETV Bharat / state

'విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు' - sanitation works in huzurnagar

వానాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశమున్నందున హుజూర్​నగర్​ పట్టణంలో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

mla saidi reddy participated in pattana pragathi program in huzurnagar
హుజూర్​నగర్​ పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే సైదిరెడ్డి

By

Published : Jun 4, 2020, 3:34 PM IST

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా జరగాలని హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్​నగర్​లో పట్టణ ప్రగతి రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్నారు.

వానాకాలంలో సీజనల్​ వ్యాధులు సంక్రమించే అవకాశమున్నందున పట్టణంలోని వార్డులన్నీ పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

ఎమ్మెల్యే సైదిరెడ్డి పట్టణంలోని వార్డులన్నీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ గెల్లి అర్చన రవి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details