తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి - హుజుర్​నగర్ ప్రాంతీయ వైద్యశాలలో ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ వాహనం ప్రారంభం

హుజుర్​నగర్ ప్రాంతీయ వైద్యశాలలో ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవల వాహనాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. కదలలేనిస్థితిలో ఉన్న దీర్ఘకాలిక రోగులకు ఈ వాహనాలు సేవలు అందిస్తాయని తెలిపారు.

mla Saidi Reddy launched aalana service vehicle at huzurnagar health care centre  suryapet
ఆలన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

By

Published : Aug 5, 2020, 6:30 PM IST

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ... కదలలేనిస్థితిలో ఉన్నరోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్​నగర్​ ప్రాంతీయ వైద్యశాలలో ఆలన ప్యాలియేటివ్ హోమ్ కేర్ సేవల వాహనాన్ని ప్రారంభించారు.

ఆలన వాహనంలో ఒక డాక్టర్, స్టాఫ్​నర్స్ ఉంటారని జిల్లా వైద్యారోగ్య అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. ప్రతిరోజు నియోజకవర్గంలోని లింగగిరి, గరిడేపల్లి, కల్మలచెరువు, నేరేడుచర్ల, పెంచికల్ దిన్న మండలాల పరిధిలోని క్యాన్సర్, కిడ్నీ, పక్షవాత వంటి దీర్ఘకాలిక రోగులకు సేవలు అందిస్తాయని వివరించారు.

ఇదీ చదవండి:పునాది రాయితో పులకించిన అయోధ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details