సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో రామస్వామి గట్టు వద్ద నివసిస్తోన్న నిరుపేదలు హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని కలిశారు. తమకు ఉండటానికి సరైన నివాసం లేదని, రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. మంచి నీటి సౌకర్యం కల్పించాలని విన్నవించారు.
'ఎమ్మెల్యే గారూ! మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పించండి' - mla saidi reddy assures to give double bedroom house
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని రామస్వామి గట్టు వాసులు ఎమ్మెల్యేకు తమ గోడును విన్నవించారు.

ఎమ్మెల్యే సైదిరెడ్డికి పేదల విజ్ఞప్తి
స్పందించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి:కోయంబత్తూరులో మరో గజరాజు మృతి!
TAGGED:
huzurnagar mla saidi reddy