సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్ననేమిల గ్రామంలో 4వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెద్దచెరువులో 2 లక్షల 9 వేల చేప పిల్లలను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వదిలారు. అనంతరం మండల కేంద్రంలో 127 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతో తెలంగాణలోని ప్రతి చెరువు, కుంటను నింపే కార్యక్రమం చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే అన్నారు. నిండిన చెరువులు, కుంటలలో మత్స్యకారుల జీవనోపాధి కోసం చేపపిల్లలను ప్రభుత్వమే అందిస్తోందన్నారు.
చెరువులో చేపపిల్లలను వదిలిన ఎమ్మెల్యే కిశోర్‌కుమార్
తెరాస పాలనలోనే కులవృత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లాలోని చిన్ననేమిల గ్రామంలోని పెద్దచెరువులో 2లక్షల 9వేల చేపపిల్లలను ఎమ్మెల్యే వదిలారు.
మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతారని, తెరాస ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వృత్తి భద్రత కల్పిస్తుందనడానికి ఇదో నిదర్శనమని తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం బాగుపడుతుదని.. అందుకు వారికి అన్నివేళలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కో-ఆర్డినేటర్ ఎస్ఏ. రజాక్, జడ్పీటీసీ కన్నా సూరాంభ వీరన్న, వైస్ ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ రజతోత్సవం.. చంద్రబాబు శుభాకాంక్షలు