సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆర్థిక సాయం అందజేశారు. విద్యుదాఘాతంతో మృతి చెందిన డి.కొత్తపల్లి వాసి గైగుళ్ల సత్తయ్య భార్యకు రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును తెరాస తరఫున అందజేశారు.
కార్యకర్తల సంక్షేమమే తెరాస ధ్యేయం: ఎమ్మెల్యే గాదరి కిశోర్ - రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కు
పార్టీ కార్యకర్తల సంక్షేమమే తెరాస ప్రధాన ధ్యేయమన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్. నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ.. పేదలకెప్పుడూ అండగానే ఉంటుందని స్పష్టం చేశారు.
కార్యకర్తల సంక్షేమమే తెరాస ధ్యేయం: ఎమ్మెల్యే గాదరి కిశోర్
ప్రమాద బీమా.. మరణించిన పార్టీ సభ్యుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే. ప్రతీ కార్యకర్తను.. అధిష్ఠానం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ పేదలకెప్పుడూ అండగానే ఉంటుందని స్పష్టం చేశారు.