తెరాస కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త మట్టిపల్లి వెంకట్ ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఆక్సిడెంట్ కావడం వల్ల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న గాదరి కిశోర్... హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మట్టిపల్లి వెంకట్‌ని పరామర్శించారు.
కార్యకర్తలందరికీ అండగా ఉంటా: ఎమ్మెల్యే గాదరి కిశోర్ - తెలంగాణ తాజా వార్తలు
తెరాస కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే గాదరి కిశోర్ హామీ ఇచ్చారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ కార్యకర్తని ఆయన పరామర్శించారు. వైద్యం కోసం ఆర్థిక సాయం అందజేశారు.
కార్యకర్తలందరికీ అండగా ఉంటా: ఎమ్మెల్యే గాదరి కిశోర్
వెంకట్ వైద్యానికి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. వెంకట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.