తుంగతుర్తిలోని కొవిడ్ బాధితులకు ఏమాత్రం ఆరోగ్యం విషమించినా సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ఆక్సిజన్ వసతి లేకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ బాబు రూ.2.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ మొత్తంతో ఆస్పత్రిలో 12 బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న పడకల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
పీహెచ్సీలో పడకల కోసం ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆర్థిక సాయం - సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో జరుగుతున్న కొవిడ్ అత్యవసర సేవల పనులను ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పరిశీలించారు. కొవిడ్ బాధితులకు అత్యవసర చికిత్సను స్థానికంగానే అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సాయంతో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే
అనంతరం నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆస్పత్రిలో మౌలిక వసుతులపై ఆరా తీశారు. దవాఖానాలోని సమస్యను వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కోట చలం, హర్షవర్ధన్, స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.