సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ శంకుస్థాపన చేశారు. డి.కొత్తపల్లి, లక్ష్మాపురం గ్రామాల్లో రూ. 12.6 లక్షల అంచనా వ్యయంతో వైకుంఠధామాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.
పసునూరులో పాఠశాల ప్రహరీ, నర్సింహులగూడెంలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రహదారి, వైకుంఠధామాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నాగారం బంగ్లా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ప్రారంభించారు.