సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని అభివృద్ధి పనులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గురువారం ప్రారంభించారు.
★ తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నూతన వస్త్రాలు అందజేశారు.
★ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో రూ.12.6 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు.