పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ - Distribution of Essential Commodities to Pastors
లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్లకు సూర్యాపేటలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మే 31 వరకు ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు.
నిత్యావసర సరుకుల పంపిణీ
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో వంద మంది పాస్టర్లకు నిత్యావసరాలు, బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రావు, క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని పాస్టర్లకు బియ్యం, నిత్యావసరాలను ఎమ్మెల్యే గాదరి కిశోర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పల్లా రాజేశ్వర్ రావు దాతృత్వం వెలకట్టలేనిదని ఆయన వెల్లడించారు. కరోనా మహమ్మారిని అరికట్టాలంటే ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను పాటించాలని కోరారు.
TAGGED:
నిత్యావసర సరుకుల పంపిణీ