దేవాదుల ప్రాజెక్టు ద్వారా 13,500 ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలకేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖ అధికారులతో మాట్లాడి.. తమ నివేదికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుమలగిరి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య ట్రాక్టర్‌ను ఛైర్‌పర్సన్‌కు అందజేశారు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఇచ్చారు.
'దేవాదుల ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు' - దేవాదుల ప్రాజెక్టుతో తిరుమలగిరికి నీళ్లు వస్తాయన్న ఎమ్మెల్యే గాదరి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలకేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పాల్గొని.. వివిధ శాఖ అధికారులతో మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తిరుమలగిరి మండలానికి 13,500 ఎకరాలకు నీరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొట్టమొదట తుంగతుర్తి రైతులే లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా వేగంగా విస్తరిస్తున్నా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొన్నారని గాదరి కిశోర్ అన్నారు. తిరుమలగిరి మండలానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా 13,500 ఎకరాలకు నీరు వస్తుందన్నారు. కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు వాడుతూ భౌతికదూరం పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్