సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, మండలాల్లో 195 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు.అనంతరం రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గాదరి కిషోర్ - ఎమ్మెల్యే గాదరి కిషోర్ తాజా వార్తలు
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాల్లో పర్యటించారు.
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: గాదరి కిషోర్
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని కిషోర్ అన్నారు. అందుకే రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నడవలేని స్థితిలో చిరుత.. గేదెల దాడే కారణమని అనుమానం..!