నియోజకవర్గాన్ని సమస్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్. సూర్యాపేట జిల్లాలోని నాగారం, తిరుమలగిరి మండలాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల అధికాలతో చర్చించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని వారిని ఆదేశించారు.
గతంతో పోలిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఎమ్మెల్యే. కాళేశ్వరం ప్రాజక్ట్తో చెరువులన్ని నిండు కుండలను తలపిస్తున్నాయని వివరించారు. సమస్యలను ఎప్పటికప్పుడు.. మంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.