రైతులను రాజు చేయాలనే లక్ష్యంగా రైతు వేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే... పలు గ్రామాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు.
'రైతులను రాజును చేయటమే ప్రభుత్వ లక్ష్యం' - అనంతగిరి వార్తలు
సూర్యాపేట జిల్లా కోదాడ, అనంతగిరి మండలాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. పలు గ్రామాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు వేదికలు దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే తెలిపారు.
mla bollam mallaiah yadhav visited in kodhada
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రైతు వేదికలు దేశానికే ఆదర్శం అని ఎమ్మెల్యే తెలిపారు. రైతులంతా కలసి పంటల సాగులో నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వేదికలు ఉపయోగపడతాయని వివరించారు. అధికారులు నిర్లక్ష్యం వహించకుండా... పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అనంతగిరి మండల నూతన పశు వైద్యశాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.