సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రెడ్లకుంట, అనంతగిరి మండలంలోని కొత్తగూడెం ఎన్నెస్పీ కాలువలను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సందర్శించారు. ఎన్నెస్పీ కాలువల ఆయకట్టు రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలువకు మరమ్మతులు చేయించి.. ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నెస్పీ మేజర్ కాలువలను ఆధునికీకరిస్తాం : ఎమ్మెల్యే బొల్లం - సూర్యాపేట జిల్లా వార్తలు
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట, అనంతగిరి మండలం కొత్తగూడెం ఎన్నెస్పీ మేజర్ కాలువలను మరమ్మతులు చేసి ఆధునికీకరిస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ద్విచక్ర వాహనంపై ఎన్నెస్పీ కాలువను సందర్శించి రైతులతో ముచ్చటించారు.
ఎన్నెస్పీ మేజర్ కాలువలను ఆధునికరిస్తాం : ఎమ్మెల్యే బొల్లం
ఆయకట్టు కింద ఉన్న రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా ప్రణాళిలకు రూపొందిస్తామని.. రైతులు సంతోషంగా సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి:కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు