తెలంగాణ

telangana

ETV Bharat / state

35 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Suryapeta District Latest News

కోదాడలోని 35 వార్డుల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు 'ప్రజల కోసం-ప్రగతి కోసం' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

MLA Bollam Mallaiah Yadav visited thirty five wards of Kodada town
కోదాడ పట్టణ వార్డుల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటన

By

Published : Feb 11, 2021, 10:06 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 35 వార్డుల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డ్రైనేజి, రహదారులు, పారిశుద్ధ్యం తదితర వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టారు.

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు తెలుసుకునేందుకు 52రోజుల ప్రణాళికను రూపొందించి 'ప్రజల కోసం-ప్రగతి కోసం' అనే కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు కోదాడ మున్సిలిటీతో పాటు అనంతగిరి, మునగాల మండలాల్లో పర్యటించారు. అధికారులతో గ్రామ, వార్డుల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు.

కార్యక్రమంలో కోదాడ ఛైర్​పర్సన్ వనపర్తి శిరీష, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, కౌన్సిలర్ మేధార లలిత పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అభివృద్ధే లక్ష్యం... బల్దియా పీఠమెక్కిన మహిళామణులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details