తెలంగాణ

telangana

ETV Bharat / state

సంచార మరుగుదొడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే - కోదాడ తాజా వార్తలు

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా కోదాడలో షీ టాయ్​లెట్స్​ పేరుతో మహిళల కోసం సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ అన్నారు. కోదాడ మున్సిపాలిటీలో మహిళల కోసం ఆయన సంచార మరుగుదొడ్లను ప్రారంభించారు.

mla bollam mallaiah yadav inaugurates mobile toilets in kodada
సంచార మరుగుదొడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Aug 20, 2020, 6:14 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మహిళల కోసం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ షీ టాయ్​లెట్స్​ పేరుతో సంచార మరుగుదొడ్లు ప్రారంభించారు. పట్టణానికి చెందిన ఎన్నారై జలగం సుధీర్​ సహకారంతో సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా, పైలట్​ ప్రాజెక్ట్​గా కోదాడ మున్సిపాలిటీలో మహిళల కోసం సంచార మరుగుదొడ్లు ప్రారంభిస్తున్నట్టు ఎమ్మెల్యే అన్నారు.

వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే మహిళలు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఇకపై ఉండదని ఆయన అన్నారు. అమెరికాలో సంచార మరుగుదొడ్లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఎలక్ట్రిక్​ బ్యాటరీతో నడిచే ఈ వాహనం మహిళల సౌకర్యార్థం ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చని ఎన్నారై జలగం సుధీర్​ పేర్కొన్నారు. సంచార మరుగుదొడ్ల వాహనాలను మహిళలే నడిపేవిధంగా శిక్షణ ఇస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష తెలిపారు.

ఇవీ చూడండి:'కరోనా టీకా అత్యవసర ఆమోదాన్ని పరిశీలిస్తాం'

ABOUT THE AUTHOR

...view details