తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే... మురిసిన స్థానికులు - mla mallaiah yadav

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

mla dance
mla dance

By

Published : Sep 18, 2021, 5:26 PM IST

Updated : Sep 18, 2021, 5:36 PM IST

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని భీక్యా తండలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక ఆదివాసీలతో కలిసి ​గురువారం రాత్రి వినాయకుడి పూజలో పాల్గొన్నారు. అనంతరం స్థానికుల కోరిక మేరకు వారితో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. ఎమ్మెల్యే డాన్స్ వేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ కవిత, సర్పంచ్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Sep 18, 2021, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details