సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో 63 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలో 63 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఆడపిల్లలున్న కుటుంబాలకు ఎంతో చేయూతనిస్తుందని ఆయన అన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం
పేదింటి ఆడపిల్లలకు ఈ చెక్కులు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆడబిడ్డల పెళ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ.1,00,116 అందజేస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి :'ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?'