తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్ భగీరథ పైప్​లైన్ లీకేజీ.. వృథాగా తాగునీరు - తెలంగాణ వార్తలు

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలి నీరంతా వృథాగా పోయింది. రహదారిపై నీరు చేరడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

mission bhagiratha pipeline leakage, pipeline leakage at nereducharla
పగిలిన మిషన్ భగీరథ పైప్​లైన్, నేరేడుచర్లలో మిషన్ భగీరథ పైప్​లైన్ లీకేజీ

By

Published : Apr 26, 2021, 1:58 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్​లైన్ పగిలింది. ఫలితంగా తాగు నీరు వృథాగా పోయింది. రహదారి జలమయమై... రాకపోకలకు వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గతంలోనూ పైప్ లీకైందని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:కొవిడ్​ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్​ కోతలు

ABOUT THE AUTHOR

...view details