తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి భూ ప్రకంపనలు... ఇళ్లలోనుంచి పరుగులు తీసిన ప్రజలు - suryapet district news

సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఇవాళ మధ్యాహ్నం నాలుగు సెకన్లపాటు సంభవించిన ఈ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

By

Published : Jul 9, 2020, 7:51 PM IST

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్​నగర్​ మండలాల్లో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కొన్ని క్షణాలపాటు స్వల్పంగా భూమి కంపించింది. పలు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు లోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటికి చాలాసార్లు భూప్రకంపనలు వచ్చాయని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద జరుగుతున్న మైనింగ్​ వల్ల భూప్రకంపనలు వస్తున్నాయా.. అనేది అర్థం కావటం లేదని వాపోతున్నారు.

పులిచింతల ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన భూకంపలేఖినిపై ప్రకంపనల తీవ్రత 3.0గా నమోదైందని చింతలపాలెం తహసీల్దార్‌ కమలాకర్‌ తెలిపారు.

ఇవీ చూడండి: అంతరిక్ష రంగాన్ని సైతం ప్రైవేటీకరించడం ప్రమాదకరం: సీపీఐ

ABOUT THE AUTHOR

...view details