పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాల్లో మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని.. రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాలని, పరిశుభ్రత ద్వారా గ్రామాలన్నీ ఆరోగ్యంగా అభివృద్ధిలో ఉంటాన్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక శాసన సభ్యులు గాదరి కిషోర్ హాజరయ్యారు.
ఊరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టారని అన్నారు. తద్వారా గ్రామాలను సస్యశ్యామలంగా పరిశుభ్రంగా సంతోషకరమైన వాతావరణంలో ఉండేలా చేశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు, నీటితో కళకళలాడుతున్నాయన్నారు. పంట పొలాలు పచ్చగా ఉన్నాయని, ఇది తెరాస పార్టీకే సాధ్యం అయ్యిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
'గ్రామాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి' - 'గ్రామాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి'
ఊరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సదుద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'గ్రామాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి'
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'