హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి తరఫున గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే బాపురావు ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు తండాలలో రోడ్‌షో నిర్వహించిన మంత్రికి ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గిరిజన నృత్యాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తండావాసుల ఘన స్వాగతాన్ని మనసారా ఆస్వాదించిన మంత్రి... సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గిరిజనులంతా సీఎం కేసీఆర్ వెంటనే ఉన్నారని తెరాస విజయంతో నిరూపించాలని విజ్ఞప్తి చేశారు.
హుజూర్నగర్ ప్రచారంలో మంత్రి సత్యవతి రాఠోడ్ - MINISTER SATYAVATHI RATOD IN HUZURNAGAR BY ELECTIONS CAMPAIGN
హుజూర్నగర్ ప్రచారంలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. పలు తండాలలో రోడ్‌షోలు నిర్వహించిన మంత్రికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తెరాసను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
MINISTER SATYAVATHI RATOD IN HUZURNAGAR BY ELECTIONS CAMPAIGN
TAGGED:
tg_nlg_204_15