రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేసేందుకు రూపొందించిన "లీడర్మేట్" వెబ్ పోర్టల్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జన్మదినం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు.
సంక్షేమ పథకాలు ప్రజల్లోకే...
సాంకేతికతను అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకే తీసుకుపోయే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. "లీడర్మేట్" వెబ్ పోర్టల్ అన్ని రకాలగా ఉపయోగపడుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో వెబ్‌పోర్టల్ డెవలపర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.