తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు రావాలి: కేటీఆర్ - ktr congratulate uttam kumar reddy

ఏపీలోని విజయవాడ, హైదరాబాద్​కు మధ్య హైస్పీడ్ రైలు రావాలని అభిలషించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

minister-ktr-hopes-for-high-speed-rail-between-hyderabad-vijayawada
హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు రావాలి: కేటీఆర్

By

Published : Jun 29, 2020, 4:55 PM IST

Updated : Jun 29, 2020, 5:42 PM IST

హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు రావాలి: కేటీఆర్

ఆంధ్రప్రదేశ్​లో విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే హైదరాబాద్‌ ముఖ్యమైన మెట్రోపాలిటన్‌ నగరమని తెలిపారు. హైదరాబాద్‌- విజయవాడ మధ్య హైస్పీడ్‌ రైలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రెండు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు కోసం తమవంతు కృషిచేస్తామని.. రైలు వస్తే హైవే వెంబడి అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆర్డీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పురపాలక కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి..

రాష్ట్రంలో 43 రెవెన్యూ డివిజన్లు ఉండగా.. వాటిని 73కి పెంచినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చామనీ.. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలకు పెంచినట్టు కేటీఆర్‌ గుర్తుచేశారు. అధికారులు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు.

ఇవీ చూడండి:'తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా చర్యలు తప్పవు'

Last Updated : Jun 29, 2020, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details