Minister Jagadish Reddy on CPM and CPI: తెరాస అభ్యర్థి విజయానికి సీపీఐ, సీపీఎం నేతలు కృషి చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సాఫీగా పాలన సాగుతుంటే ఉపఎన్నికతో అలజడి సృష్టించారని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు నేతల సహకారంతో తెరాస అభ్యర్థి గెలిచారని తెలిపారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తామని వివరించారు.
'మునుగోడులో కమ్యూనిస్టు శ్రేణుల ప్రచారం వల్లనే తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తెరాస విజయానికి సహకరించిన సీపీఎం, సీపీఐ నేతలకు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం.'-మంత్రి జగదీశ్‌రెడ్డి