సామాజిక మార్పు కోసం అహింసా మార్గంలో అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మహాత్ముని 151వ జయంతి సందర్భంగా.. సూర్యాపేటలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులల్పించారు.
'మహాత్ముని అడుగుజాడల్లో నడవడమే నేటితరం ఆయనకిచ్చే ఘననివాళి' - minister jagadeesh in gandhi jayanthi celebrations
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడమే నేటితరం ఆయనకిచ్చే ఘననివాళి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ 151వ జయంతి
సామాజిక రుగ్మతలు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్ముడని మంత్రి పేర్కొన్నారు. కుల,మత, వర్గ విభేదాలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలలుకన్న గాంధీ.. వాటికోసం కృషి చేస్తూనే అమరులయ్యారని తెలిపారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవడమే నేటితరం ఆయనకిచ్చే ఘననివాళి అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.