కరోనా పరీక్షలపై టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండించారు. ఉనికి కోసమే ఉత్తమ్ బాధ్యతలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పరీక్షలు జరపని నిర్ధేశిత ప్రాంతాన్ని ఉత్తమ్ గుర్తిస్తే.. ఆ ప్రాంతాన్ని బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో జరిగిన శానిటైజర్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కరోనా పరీక్షలు ఎక్కడ ఎవరికి నిర్వహించాలో ఉత్తమ్ తేల్చి చెప్పాలని మంత్రి ధ్వజమెత్తారు. సూర్యాపేటలో పరీక్షలు నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య తేలిందని వెల్లడించారు. ఉత్తమ్ మాటలు కరోనా ఉద్ధృతిని కోరుకునే వారి మాటల్లా ఉన్నాయని ఆరోపించారు.