ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు ఆక్సిజన్, ఔషధాలు అందుబాటులో ఉన్నాయని... మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు అందించిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి ప్రారంభించారు.
'ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
సీఎం కేసీఆర్ దార్శనికతతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడుతున్నాయని... మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు అందించిన 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించనున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు ప్రస్తుతం కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో అత్యాధునిక సేవలు ప్రారంభమయ్యాయని, అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా కరోనా రోగులు భయాందోళలకు గురికావద్దని సూచించారు.
ఇదీ చదవండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు