కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు బయటకు రాకూడదని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగారం మండలాల్లోని కంటైన్మెంట్ జోన్లలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి పర్యటించారు.
'కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించండి' - minister jagadish visited containment areas in suryapet
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగారం మండలాల్లోని కంటైన్మెంట్ జోన్లలో మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు. ప్రతిరోజు రసాయన ద్రావణం పిచికారీ చేయించాలని అధికారులకు సూచించారు.

తిరుమలగిరిలో మంత్రి జగదీశ్ పర్యటన
కంటైన్మెంట్ జోన్లలో ప్రతిరోజు రసాయన ద్రావణాలు పిచికారీ చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్వారంటైన్లో ఉన్న వారికి వైద్య సిబ్బంది ప్రతిరోజు జనరల్ చెకప్‌లు చేస్తున్నారో లేదో ఆరా తీశారు.
అనంతరం లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సరుకులు అందజేశారు. ప్రజలంతా లాక్డౌన్ నిబంధలను కచ్చితంగా పాటించాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. కరోనాను తరిమి కొట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.