తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతువేదికలతో విప్లవాత్మక మార్పులు: జగదీశ్ రెడ్డి - మునగాలలో రైతువేదిక ప్రారంభం

రైతు ఆదాయం పెంచడం, సాగుకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకే రైతువేదికలు నిర్మిస్తున్నట్టు మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాలలో... ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​తో కలిసి రైతువేదికను ప్రారంభించారు.

minister jagadish reddy launched raithuvedika in munagala
రైతువేదికలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు: జగదీశ్ రెడ్డి

By

Published : Feb 3, 2021, 5:29 PM IST


సీఎం కేసీఆర్ ఆలోచనతో నిర్మిస్తున్న రైతువేదికలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, రైతులను సంఘటితం చేస్తాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో మొట్టమొదటి రైతువేదికను మునగాల క్లస్టర్​లో... ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​తో కలిసి ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను సాగు చేసే సమస్త సమాచారాన్ని రైతులకు అందించేందుకు రైతువేదికలను నిర్మించినట్టు తెలిపారు.

రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తూ... రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగల మార్చిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు. రైతులు మూస విధానానికి స్వస్తి చెప్పి డిమాండ్ ఉన్న పంటలే సాగు చేసేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రజలకు ఆసరాగా సంక్షేమ పథకాలు: జగదీశ్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details