వ్యవసాయాన్ని పండగలా మార్చి, రైతులకు అధిక లాభాలు వచ్చేలా సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలోని పలు మండలాల్లో బీటీ రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆ పనులను గ్రామీణ, ఆత్మకూర ఎస్, చివ్వెంల, పెన్ పహాడ్ మండలాల్లో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ వానాకాలం సీజన్లో ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు.
డిమాండ్ ఉన్న పంటలు సాగు
వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిఫుణులు, అధికారుల సాయంతో సీఎం కేసీఆర్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేలా తెలంగాణ రైతాంగాన్ని సన్నద్దం చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతుబంధు సమితీల ఆధ్యర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇక ప్రజా ప్రతినిధులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలని కోరారు.