Jagadish reddy on central: కేసీఆర్ సర్కార్ నిరంతరం అందిస్తున్న విద్యుత్‌ను అడ్డుకుని.. తెలంగాణ ప్రజల గొంతునొక్కేందుకు కేంద్రంలోని భాజపా సర్కార్ ప్రయత్నిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ సాధ్యంకాని నిరంతర కరెంటును.. తెలంగాణలో అమలు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రైవేటు సంస్థల విద్యుత్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ... హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు రావటమే భాజపా కుట్రలకు నిదర్శనమన్నారు. తెలంగాణ విద్యుత్ ఇవ్వొద్దంటూ ప్రైవేటు సంస్థలను ఇప్పటికే పలుమార్లు కేంద్రం బెదిరించిందని ఇప్పుడు ఏకంగా ఉత్తర్వులు జారీ చేసి, రైతుల గొంతునొక్కేందుకు కుట్రపన్నిందని ఆయన ఆరోపించారు
నిరంతర విద్యుత్‌ను కేంద్రం అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది. తెలంగాణలో కరెంటు సరఫరాను భాజపా జీర్ణించుకోవటంలేదు. చాలారోజులుగా ప్రైవేటువిద్యుత్ సంస్థలను బెదిరిస్తున్నారు. కుట్రలో భాగంగా ఇప్పుడు ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో నిరంతర విద్యుత్ సాధ్యకావడం లేదు. తెలంగాణలో మాదిరిగానే ఆయా రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తున్నాయి. హైకోర్టు మాకు అనుకూలంగా ఇచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రైతుల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.